నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం | - | Sakshi
Sakshi News home page

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం

Jan 19 2026 4:43 AM | Updated on Jan 19 2026 4:43 AM

నేడు

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం ఆటో బోల్తా.. ఒకరు మృతి శతాధిక వృద్ధుడు మృతి పొగాకు బ్యారన్‌ దగ్ధం త్రిపురాంతకం ఆలయంలో ప్రత్యేక పూజలు

ఒంగోలు సబర్బన్‌: స్థానిక కలెక్టరేట్‌లో ఉన్న మీ కోసం భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. ఆ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మీ కోసం కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అర్జీదారుల సమస్యలు పరిష్కారం కాకుంటే సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌ చేయవచ్చని చెప్పారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్‌ సూచించారు.

కనిగిరి రూరల్‌: ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పొదిలి రోడ్డు వైపు నుంచి కనిగిరికి వేగంగా వస్తున్న బ్యాటరీ ఆటో పట్టణ సమీపంలోని టకారిపాలెం వద్ద కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మిశనం కోటేశు (41), మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోటేశు మృతి చెందాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగులుప్పలపాడు: నూరేళ్లు బతికిన వృద్ధుడు ఆదివారం సాయంత్రం మరణించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఒమ్మెవరం గ్రామానికి చెందిన కొమ్ము ఆహరోను (101) 1925 జూలై 7వ తేదీ జన్మించాడు. పాత కాలపు ఆహార అలవాట్లతో పాటు ఎలాంటి దురలవాట్లు లేకపోవడంతో వందేళ్లు జీవించాడు. గతేడాది ఆహరోను వందవ పుట్టినరోజు వేడుకను తన సంతానంతో జరుపుకున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు.

పొదిలిరూరల్‌: మండలంలోని రామపురంలో ఆదివారం పొగాకు బ్యారెన్‌ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన పాలడగు వెంకయ్య చెందిన పొగాకు బ్యారన్‌ క్యూరింగ్‌ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఆకులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యారన్‌ మొత్తం వ్యాపించాయి. దర్శి అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే పొగాకు మొత్తం కాలిపోయింది. బ్యారన్‌లో ఉన్న ఆకుతో పాటు టైర్లు, అల్లుడు కర్ర, గొట్టాలు కాలిపోవడంతో ప్రమాదంలో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

మౌని అమావాస్య సందర్భంగా పోటెత్తిన భక్తులు

పూజలు చేసిన రాజాసాబ్‌ డైరెక్టర్‌ మారుతి

త్రిపురాంతకం: మౌని అమావాస్య సందర్భంగా స్థానిక శ్రీబాలాత్రిపురసుందరీదేవి, శ్రీపార్వతీ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సినీ దర్శకుడు మారుతి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఇటీవల రిలీజైన ప్రభాస్‌ నటించిన రాజాసాబ్‌ సినిమాకు డైరెక్టర్‌గా పనిచేసిన మారుతి.. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆశీర్వచనం అందుకున్నారు.

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం 1
1/3

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం 2
2/3

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం 3
3/3

నేడు ఒంగోలులో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మీ కోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement