మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన నియోజకవర్గ నాయకులను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ క్షేత్ర స్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ జగన్ సూచించినట్లు నేతలు తెలిపారు. మార్కాపురం టౌన్, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల నాయకులు పాల్గొన్నారు.