
శ్రీసత్యసాయి జిల్లా: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.
శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఉపేక్షించబోమని చెబుతున్న పవన్‌కు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎంందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్‌కు తెలియదా? అని శ్యామల నిలదీశారు. రాష్ట్రంలో రోజుకో దారుణం జరుగుతున్నా పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారని ప్రశ్నించారు.
ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ మౌనం దాల్చడంపై ‘డీసీఎం మిస్సింగ్’ అనే ఫ్లకార్డును ప్రదర్శించారు శ్యామల.
టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు.. ఈవీఎంల గెలుపని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, పేదల సన్నిధి వైఎస్ జగన్ అని శ్యామల కొనియాడారు.
