కూటమి సర్కార్‌ చీప్‌ ట్రిక్స్‌.. వైఎస్సార్‌సీపీ ఫైర్‌ | YSRCP Slams Chandrababu Govt Over Polavaram Files Issue | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌ చీప్‌ ట్రిక్స్‌.. వైఎస్సార్‌సీపీ ఫైర్‌

Aug 17 2024 7:11 PM | Updated on Aug 17 2024 9:22 PM

YSRCP Slams Chandrababu Govt Over Polavaram Files Issue

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌ ఏర్పడిన నాటి నుంచి తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఇక, తాజాగా పోలవరం ఫైల్స్‌ దగ్దం అంటూ మరో ఫేక్‌ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో, సర్కార్‌ చీప్‌ ట్రిక్స్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోలవరం ఫైల్స్‌ ఘటనపై వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..‘తెలుగుదేశం పార్టీ మీ దరిద్రపు బతుకులు ఎప్పుడూ ఇంతే. విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారు. ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టడం మాని బురదజల్లుడు పనులే చేస్తున్నారు.

 

చంద్రబాబు వల్లే పోలవరం డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిన  నేపథ్యంలో ఇలాంటి చెత్త ప్రచారాలకు దిగారు. అవి పనికిమాలిన కాగితాలని మీ అధికారులే తేల్చారు. అయినా ఇంకా ఏదో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ సేకరణ చేసే అధీకృత అధికారి కలెక్టర్. ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతీ పత్రం ఉంటుంది. ఇకనైనా సిగ్గు మాలిన ప్రచారాలు మాని ప్రజలకు మేలు చేసే పనులపై దృష్టి పెట్టండి అంటూ హితవు పలికింది. 

 

 

 ఇదీ చదవండి: ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement