కాంగ్రెస్‌, రాహుల్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు.. | YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, రాహుల్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు..

Feb 22 2024 11:53 AM | Updated on Feb 22 2024 12:21 PM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Congress - Sakshi

సాక్షి, తాడేపల్లి: కాంగ్రెస్‌ పార్టీపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు హస్తం పార్టీని వీడిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. రేపు మాపో బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. 

కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. తాజాగా ట్విట్టర్‌లో..‘కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల కొరత ఎక్కువగా ఉంది. రేపు రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాంగ్రెస్ తన పునాదిని, అగ్రనేతలను కూడా కోల్పోయింది. ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లే దేశమంతటా ఈ పరిస్థితి ఏర్పడింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement