ఎగ్జిట్‌పోల్స్‌ను పట్టించుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి | YSRCP MP Key Comments On Exit Polls Over AP Elections | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌పోల్స్‌ను పట్టించుకోవద్దు.. వైఎ‍స్సార్‌సీపీదే విజయం: వైవీ సుబ్బారెడ్డి

Jun 3 2024 12:38 PM | Updated on Jun 3 2024 3:30 PM

YSRCP MP Key Comments On Exit Polls Over AP Elections

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పారు.

కాగా, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్‌ సెంటర్లకు చేరుకోవాలి.

ఇక, ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు. మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. 

ఎలక్షన్ కౌంటింగ్ ఏర్పాట్లపై YV సుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement