‘మహిళల భద్రతపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు’

Ysrcp Mlc Iqbal Slams On Nara Lokesh - Sakshi

సాక్షి, అనంతపురం: మహిళల భద్రత పై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్ ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నారాలోకేష్, వర్లరామయ్య అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, హోంమంత్రి, డీజీపీలపై విమర్శలు అర్థరహితంగా పేర్కొన్నారు. మహిళల రక్షణకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశ చట్టాన్ని తెచ్చారన్నారు. దీని ద్వారా నేరం జరిగిన 7 రోజుల్లో ఛార్జిషీట్ వేస్తున్న ఘనత ఏపీ పోలీసులకే దక్కుతుందని కొనియాడారు. 

దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కావాలని, అప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడుతాయని తెలిపారు. ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు దిశ చట్టం ఆమోదం పొందేలా కేంద్రానికి ఎందుకు కోరలేదని ‍‍ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థకు టీడీపీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. 

చదవండి: విద్యార్థి మృతిపై లోకేశ్‌ తప్పుడు ప్రచారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top