కురసాల కన్నబాబు(ఫైల్‌ఫోటో)
కాకినాడ: చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని, దర్యాప్తు సంస్థలను ఇంట్లో సంస్థలుగా మార్చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసును చంద్రబాబు కొట్టేయించుకోవడమే ఉదాహరణ అని అన్నారు. ‘ ఈ సంక్రాంతికి చంద్రబాబు ఆయనకు ఆయనే కానుక ఇచ్చుకున్నారు. ఆయన మీద ఉన్న స్కిల్ స్కామ్ కేసున ఎత్తివేసుకున్నాడు. ఈ కేసులో ఆయనే నిందితుడు ,ఆయనే న్యాయవాది, ఆయనే తీర్పు ఇచ్చేసుకున్నారు.
ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా తన మీద తన కేసునే ఎత్తివేసుకున్నాడు. ఉద్యోగుల డిఎలు, కాంట్రాక్టులకు బిల్లు చెల్లింపులను సంక్రాంతి కానుక అని ఎల్లో మీడియాలో రాశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఎత్తివేశారు. దర్యాప్తు సంస్ధలను తన గుప్పెట్లో పెట్టుకుని తన కేసులను ఎత్తివేసుకుంటున్నాడు. జగన్ జన్మదినం సందర్భంగా మేకను కోస్తే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద కేసులు పెట్టి ధర్డ్ డిగ్రీ వారిపై ప్రయోగించారు.రేపు కొబ్బరి కాయ కొడితే కేసు పెట్టేలా ఉన్నారు. *చంద్రబాబు మీద ఉన్న స్కామ్ కేసులపై వైఎస్ఆర్ సిపి న్యాయపోరాటం చేస్తుంది’ అని స్పష్టం చేశారు.


