రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Tweet On Chandrababu Naidu Government Over Violence And Attacks In AP, Tweet Inside | Sakshi
Sakshi News home page

రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది: వైఎస్‌ జగన్‌

Aug 4 2024 5:21 PM | Updated on Aug 4 2024 6:12 PM

Ys Jagan Tweet On Chandrababu Government

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది.. ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందంటూ

టీడీపీ అరాచకాలపై‌ వైఎస్ జగన్ ఫైర్
 

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని.. ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

‘‘పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement