భారీ జనసందోహం మధ్య సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం

Yogi Adityanath Takes Oath As Uttar Pradesh CM For Second Time - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలో శుక్రవారం యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ప్రమాణ స్వీకార కార్యక‍్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే 52 మంది మంత్రులతో యోగి జంబో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో 18 మందికి కేబినెట్‌ హోదా, 14 మందికి స‍్వతంత్ర హోదాను కల్పించారు. తన మంత్రి వర్గంలో మరో 20 మంది సహాయ మంత్రులకు సీఎం చోటు కల్పించారు. కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రిజేష్‌ పాఠక్‌లకు డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేశవ్‌ ప్రసాద్‌ ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ సీఎం యోగి ఆయనకు కీలక బాధ్యతను అప్పగించడం విశేషం. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. భార జనసందోహం మధ్య సీఎంగా ఆయన ప్రమాణం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top