విభజన హామీలపై ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా? | Vijayasai Reddy question to Purandeshwari | Sakshi
Sakshi News home page

విభజన హామీలపై ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా?

Dec 1 2023 2:53 AM | Updated on Dec 1 2023 2:53 AM

Vijayasai Reddy question to Purandeshwari - Sakshi

సాక్షి,అమరావతి: విభజన సమస్యలు పరిష్కరించమని, ఏపీకి ఇచ్చిన హామీలు నెర­వేర్చమని కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏనాడైనా డిమాండ్‌ చేశారా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నత పదవులు చేపట్టి ఏమి వెలగబెట్టారని నిలదీశారు. నాగార్జున సాగర్‌­లో ఏపీ నీటి వాటా కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే పోలీసులను ఎందుకు పంపారని పురందేశ్వరి ప్రశ్నించడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు.

చంద్రబాబు మాదిరి ఏపీ రైతులంటే పురందేశ్వరికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ నేత సుబ్బిరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కేవలం భోజనానికి వెళితేనే.. టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారంటూ చంద్రబాబు, పురందే­శ్వరి ప్రచారం చేశారని గుర్తుచేశారు. అటువంటి వీరి­ద్దరూ ఇప్పుడు అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ కాంగ్రెస్‌ పార్టీతో ఎలా అంటకాగుతున్నారని,  కాంగ్రెస్‌ పార్టీలో కలిసిపోయారా అని ప్రశ్నలు సంధించారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్ట­ర్‌ను పెప్పర్‌ మోషన్‌  సంస్థ ఏర్పాటు చేస్తోందన్నారు. అత్యాధునిక పరిజా్ఙనంతో అవుకు రెండో సొరంగం పూర్తి చేసి సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారని, దీంతో రాయలసీమ, నెల్లూరు జిల్లా­ల్లో 2.60 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement