రైతు సంక్షేమానికే పెద్దపీట | Uttam Kumar Reddy Sensational Comments on BRS: Telangana | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికే పెద్దపీట

Published Sat, Nov 30 2024 5:40 AM | Last Updated on Sat, Nov 30 2024 5:40 AM

Uttam Kumar Reddy Sensational Comments on BRS: Telangana

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేసింది: మంత్రి ఉత్తమ్‌ 

రైతు పండుగ రెండోరోజుకు పోటెత్తిన రైతులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కానున్న సందర్భంగా.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ సదస్సును మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. శుక్రవారం జరిగిన రెండో రోజు ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు పోటెత్తారు. మరో మంత్రి తుమ్మలతో కలిసి రైతు పండుగ స్టాళ్లను పరిశీలించారు.

అనంతరం రైతు అవగాహన సదస్సులో ఉత్తమ్‌ మాట్లా డుతూ ప్రస్తు త కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. మిగిలిన కొంత మంది రైతుల రుణమాఫీపై నేటి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటన చేస్తారన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని.. అందుకే రైతు లు పండుగ చేసుకుంటున్నారని ఉత్తమ్‌ అన్నారు. రైతు పండుగ ఏర్పాట్లు, స్టాళ్లు చాలాఅద్భుతంగా ఉన్నాయని.. వ్యవసాయశాఖ మంత్రి అనుభవం, వారి దక్షతే ఇందుకు కారణమని కొనియాడారు. 

ఏది మంచిదో రైతులే చెప్పాలి: తుమ్మల 
రైతులకు అండగా ఉంటామని,అయితే ఏది మంచిదో రైతులే చెప్పాలని, మీ సలహాలు, సూచనలు వినడానికే ఈ రైతు సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుబంధు కంటే బోనస్‌ బాగుంటుందని రైతులే అంటున్నారని.. రైతుల అభిప్రాయం మేరకు వారికి మేలు చేసే పథకాలనే కొనసాగిస్తామని తెలిపా రు. ఎండాకాలం పంటకు సంబంధించి మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయన్నారు. ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడు విడు దల చేస్తారో త్వరగా నిర్ణయం తీసుకొని.. ఇరిగేషన్‌ ప్లాన్‌ ను అమలు చేయాలని ఉత్తమ్‌ను కోరారు. ఇందుకనుగుణంగా పంట ఎలా సాగు చేయాలనే దానిపై రైతులకు వ్యవసాయశాఖ తగు సూచనలిస్తుందన్నారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌ రావు, కమిషనర్‌ గోపి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌.చౌహాన్, కలెక్టర్‌ విజయేందిర బోయి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నా రు. ఆ తర్వాత శనివారం జరగనున్న సీఎం బహి రంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. అనంతరం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌కు చేరుకొని ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు.

మందులు పిచికారీకి బ్లేయర్‌ 
Ü    ఈ మిషన్‌ పేరు గోదావరి బ్లేయర్‌. దీని విలువ రూ.లక్ష. దానిమ్మ, ద్రాక్ష, ఇతర పందిరి తోటల సాగులో ఈ యంత్రం రైతులకు అనువుగా ఉంటుంది. మందులు పిచికారీ చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. పందిరిలో రెండు వైపులా సాళ్లలో కప్పుకున్న తోటకు మంచు మాదిరిగా మందులు పిచికారీ చేస్తుంది. ఎక్కడా గ్యాప్‌ లేకుండా పిచికారీ చేయడం దీని ప్రత్యేకత. ఈ యంత్రం 6 హెచ్‌పీ పంపుసెట్‌తో 300 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు కలిగి ఉంటుంది. ఒకసారి ట్యాంకు నింపితే 18 నిమిషాల్లో ఎకరన్నర పొలంలో మందులు పిచికారీ చేయొచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చు.  

కలుపు తీసేందుకు టిల్లర్‌ 
Ü    ఈ యంత్రం పేరు టిల్లర్‌. దీనిని ఉపయోగించి పంటలో కలుపు తీయొచ్చు. దీని ధర రూ.58 వేలు. ఫోర్‌ స్ట్రోక్‌ సామర్థ్యం కలిగిన ఈ యంత్రం లీటర్‌ పెట్రోల్‌కు 1.5 ఎకరాలో కలుపు తీయడానికి సహాయ పడుతుంది. దీనిని రైతులు సులువుగా నడిపించొచ్చు. చేతిలో పట్టుకొని కలుపు ఉన్న సాళ్ల మధ్య తిప్పితే సరిపోతుంది. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు తక్కువ ఖర్చుతో ఈ టిల్లర్‌ మిషన్‌ ద్వారా పంటలో సులభంగా కలుపు తీయొచ్చు. ఎంత మోతాదులో కలుపు తీయొచ్చో అందుకు తగినట్టుగా సర్దుబాటు చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement