
సాక్షి, హైదరాబాద్: రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే బీఆర్‌ఎస్ పార్టీ పని చేస్తుంది తప్ప.. ప్రజా ప్రయోజనాల కోసం కాదని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ చెప్పేదొకటి.. చేసేది ఒకటిగా ఉందని విమర్శించారు.