మాజీ మంత్రి ఇంటికి రేవంత్‌.. పార్టీలోకి ఆహ్వానం | TPCC Chief Revanth Reddy Meets Devender Reddy At His Home | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఇంటికి రేవంత్‌.. పార్టీలోకి ఆహ్వానం

Jul 18 2021 7:01 PM | Updated on Jul 19 2021 4:13 PM

TPCC Chief Revanth Reddy Meets Devender Reddy At His Home - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఉన్నారు. ఈ సందర్బంగా దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్‌లతో రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ముగ్గురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.  

ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ తెలంగాణలో కారు దారి తప్పింది. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తాం. తెలంగాణ భవిష్యత్తు కార్యాచరణ కోసం పని చేస్తాం. తెలంగాణకు పట్టిన గులాబీ చీడ వదిలిస్తాం. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల లాంటి సంక్షేమం పేదలకు దూరం అయ్యింది. తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి దేవేందర్ గౌడ్’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement