Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Top 10 News MLAs Purchase Case SIT Notices Bandi Sanjay Follower 17th Nov 2022 - Sakshi

1. MLAs Purchase Case: బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌కు గురువారం సిట్‌ నోటీసులు ఇచ్చింది. నవంబర్‌ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అబద్ధాలపై పేటెంట్‌ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఒక  రికార్డు ఉంది. దేశంలోనే మరే నేత అంతలా అబద్దాలు ఆడలేరన్నది ఆయన రికార్డుగా చాలామంది చెబుతుంటారు. ఆయన విశిష్టత ఏమిటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న అబద్దాన్ని అలవోకగా చెప్పడం. దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే, పదే వల్లె వేస్తుండడం.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్‌.. అనూహ్యంగా ఎదిగిన కమలం
ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా కెసిఆర్ పైన, ఆయన కుటుంబంపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాకపోతే కెసిఆర్ పేరు ఎత్తలేదు. కాని మోడీ ప్రసంగంలో విమర్శల తీవ్రత భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా తీసుకోవచ్చు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవు.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్‌
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశావ్‌ చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. చివరి అవకాశం అంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా ప్రజల మీద పడ్డావు అని మండిపడ్డారు. కులపిచ్చితో రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని నాశనం చేశావని మండిపడ్డారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే శాఖ.. వారికి భారీగా పెరగనున్న జీతాలు
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్‌వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అమెరికా అధ్యక్ష బరిలో బరాక్‌ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్‌
అమెరికా మాజీ ప్రథమ మిచెల్‌ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్‌....నివ్వెరపోయిన పోలీసులు
యావత్తు దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అప్తాబ్‌ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ఢిల్లీలో ఒక ఫ్లాట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు ఫ్లాట్‌ విషయంలో క్లూస్‌ కోసం దర్యాప్తు చేస్తుండగా.. నీటిబిల్లుల విషయం వారిని ఆశ్చర్యపరిచింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఘన నివాళి.. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం!
సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. భారత అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 కష్టమే!
టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం అనంతరం టీమిండియా తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టు తొలుత టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌  రోహిత్ శర్మ గైర్హాజరీ కావడంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాం‍డ్యా సారథ్యం వహించనున్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్‌ సంచలన ప్రకటన
44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తాజాగామరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తారు అసలు ఏం కంపెనీకి సీఈవోగా ఉండాలని కోరుకోవడం లేదని ఈ  క్రమంలోనే  త్వరలోనే ట్విటర్‌కు కొత్త సీఈవోను  ఎంపిక చేయనున్నామని ప్రకటించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top