నీట్‌ వ్యతిరేక బిల్లు: గవర్నర్‌ వర్సెస్‌ తమిళనాడు పార్టీలు.. గవర్నర్‌ రీకాల్‌కు డీఎంకే పట్టు

TN Governor Returns NEET Bill DMK Demands Governor Recall - Sakshi

After NEET Bill Sent Back GetOutRavi Trending In Twitter: నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిరస్కరించారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని వెనక్కి పంపించినట్టు రాజ్‌ భవన్‌ గురువారం ప్రకటించింది. దీంతో గవర్నర్‌ నిర్ణయంపై డీఎంకేతో పాటుగా నీట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. 

సాక్షి, చెన్నై : గురువారం రాజ్‌ భవన్‌ విడుదల చేసిన ప్రకటనలో నీట్‌పై అసెంబ్లీలో చేసిన తీర్మా నం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్టు వివరించారు. నీట్‌ రాకతో విద్యార్థులందరికీ సామాజిక న్యాయం దక్కుతోందని పేర్కొన్నారు. సమగ్ర పరిశీలన, సమీక్ష మేరకు పేద విద్యార్థులకు నీట్‌ ఎంతో దోహదకరంగా ఉందన్నారు. Christian Medical College, Vellore Association Vs. Union of India (2020) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని వెనక్కి పంపించడమే కాకుండా, అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో, పునః పరిశీలన జరిపాలని, తగిన వివరణ ఇవ్వాలని స్పీకర్‌ అప్పవును గవర్నర్‌ ఆదేశించడం గమనార్హం.

గెట్‌అవుట్‌రవి ట్రెండింగ్‌లో..
ఇక గవర్నర్‌ నిర్ణయంపై పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ ప్రజలంతా గవర్నర్‌ రవి నిర్ణయాన్ని ఖండిస్తూ.. ట్విటర్‌లో గెట్‌ అవుట్‌ రవి యాష్‌ ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, మనోభావాల్ని గౌరవించలేనప్పుడు తప్పుకోవాలంటూ, వెళ్లిపోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఈ బిల్‌కు మద్ధతు తెలపగా.. బీజేపీ మాత్రం సభ నుంచి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. NEET అసమానతలను పెంపొందించడంతో పాటు సమాజంలోని ధనవంతులు, అధిక ప్రాధాన్యత కలిగిన తరగతికి అనుకూలంగా ఉందని,  XII తరగతిని కొనసాగించడమే కాకుండా ప్రత్యేక కోచింగ్‌ను పొందగలుగుతారు. ఇది వాస్తవంగా వైద్య మరియు దంత విద్య నుండి గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన సామాజిక వర్గాలను అడ్డుకుంటుంది.

వైద్య UG ప్రోగ్రామ్‌ల తర్వాత సంపన్న తరగతికి చెందిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడం లేదని. తరచూ విదేశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య క్షీణతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. 

రీకాల్‌ చేయండి
ఇదిలా ఉంటే నీట్‌ బిల్లును వెనక్కి పంపిన నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం గుర్రుగా ఉంది. వెంటనే గవర్నర్‌ రవిని రీకాల్‌ చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు సైతం గళం వినిపించారు. ఐదు నెలల కాలయాపన తర్వాత ఆ బిల్లును పంపించడం ఏంటో అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, డీఎంకే, సీపీఐ(ఎం) ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 5న గవర్నర్‌ నిర్ణయంపై చర్చించేందుకు.. భవిష్యత్‌ చర్యల కోసం శనివారం(ఫిబ్రవరి 5న) సీఎం స్టాలిన్‌ ఆధ్వర్యంలో ఆల్‌ పార్టీ మీటింగ్‌ జరగనుంది.

రాజ్యాంగం ప్రకారం..
సాధారణంగా అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్‌ ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తారు. ఒకవేళ వెనక్కి పంపిన బిల్లు మళ్లీ గవర్నర్‌ దగ్గరికి గనుక వస్తే మాత్రం.. దానిపై ఆయన ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపిస్తారు. ఆపై తుది నిర్ణయం రాష్ట్రపతికే ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సుభాష్‌ కశ్యప్‌ చెప్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top