ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమం 

TJS Kodandaram Says He Starts Revolution For Democratic Telangana - Sakshi

త్వరలో కార్యాచరణ: కోదండరాం

నాంపల్లి: ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన 42 రోజుల సకల జనుల సమ్మె జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివా రం అమరవీరుల స్థూపం గన్‌పార్కు వద్ద మలిదశ తెలంగాణ ఉద్యమకారులు నివాళులర్పించారు. ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో జరిగిన ఈ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నేతలు అశోక్, స్వామిగౌడ్, కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌తో పాటు పలు సంఘాల నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..  సకల జనుల సమ్మె జరిగిన రోజు సందర్భంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాకపోవడం బాధాకరం అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికి అందాలంటే ఏ తెలంగాణ కోసమైతే  కొట్లాడామో ఆ తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందని, అం దుకు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top