చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతల ఓవరాక్షన్‌ | Tirupati By Election Chandrababu Naidu Roadshow Sri Kalahastri | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతల ఓవరాక్షన్‌

Apr 8 2021 8:20 PM | Updated on Apr 8 2021 9:12 PM

Tirupati By Election Chandrababu Naidu Roadshow Sri Kalahastri  - Sakshi

రేణిగుంట (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాళహస్తి పర్యటనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి దేవాలయాలపై టీడీపీ జెండాలు ఉంచారు. దీంతో భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా దేవాలయాలపై ఇలా రాజకీయ పార్టీ జెండాలు పెట్టడాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే కాకుండా అక్కడి రోడ్ల పక్కన ఉన్న మున్సిపాలిటీ కుండీలకు కూడా టీడీపి జెండాలు కట్టారు. ఈ చర్యలు ఎన్నికల నియమావళికి వ్యతిరేకం అని మున్సిపల్‌ అధికారులు అంటున్నారు. ( చదవండి:  శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement