‘బీజేపీ వైఖరి కిమ్‌ జాంగ్‌ను తలపిస్తుంది’ | TG CM Revanth Reddy Takes On BJP | Sakshi
Sakshi News home page

‘బీజేపీ వైఖరి కిమ్‌ జాంగ్‌ను తలపిస్తుంది’

Jun 12 2026 6:19 PM | Updated on Jun 12 2026 8:14 PM

TG CM Revanth Reddy Takes On BJP

ఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్‌ జాంగ్‌లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌.. మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.  దీనిలో భాగంగా బీజీపీపై విమర్శలు సంధించారు రేవంత్‌. 

‘నార్త్‌ కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని  దుష్ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు.

‘శాంతి భద్రతల కారణంతో మేం కూడా పవన్ కళ్యాణ్ మీటింగుకు  అనుమతి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు మా మంత్రులు జవాబు ఇచ్చారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా?, హిట్లర్ నాకు ఆదర్శం కాదు. నా మాటలను మీడియా వక్రీకరించింది. హైడ్రా పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని మాత్రమే చెప్పాను. క్యాబినెట్ ఎప్పుడు విస్తరించాలో అప్పుడే విస్తరిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలే  నరేంద్ర మోదీతో ఉన్నాయి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. 

తెలంగాణ  ప్రాజెక్టుల కోసం ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారా?, కేంద్ర మంత్రుల వద్దకు కిషన్ రెడ్డితో పాటే నేను వస్తా. జూలైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్  సమావేశం ఉంటుంది. తుమ్మిడి హట్టి  ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా సహకరించాలి. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి ఢిల్లీలో డాన్స్ చేస్తున్నారు. 8 మంది ఎంపీలు కేంద్రంతో పట్టుపడితే ప్రాజెక్టులు ఎందుకు రావు. ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి మెట్రో రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి అనుచరులే ఫ్లెక్సీలు కట్టారు. కిషన్ రెడ్డి నెగటివ్ ఎనర్జీ నేను పాజిటివ్ ఎనర్జీ. స్కూలు ఫీజుల నియంత్రణపై మీడియా గట్టిగా రాస్తే నేను చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement