యూనివర్సిటీలపై పగబట్టిన పెద్దదొర: షర్మిల | Telangana: YSRTP YS Sharmila Slams On CM KCR | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీలపై పగబట్టిన పెద్దదొర: షర్మిల

May 24 2022 1:23 AM | Updated on May 24 2022 1:23 AM

Telangana: YSRTP YS Sharmila Slams On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వ విద్యాల యాలపై పెద్దదొర పగబట్టారని, సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. యూనివర్సిటీలకొస్తే విద్యార్థులు ఎక్కడ తిరగబడతా రోనని దొరకు, దొర దందా టీమ్‌కి భయం పట్టుకుందని సోమ వారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘మిమ్మల్ని అడుగు పెట్టనివ్వ లేదని వర్సిటీలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారా’ అని ఆమె ప్రశ్నించారు.

‘చదువు కుంటే ప్రశ్నిస్తరు, కొలువులు అడుగుతరనే ఖాళీగా ఉన్న 1869 ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడం లేదా’ అని షర్మిల నిలదీశారు. విద్యార్థుల చదువును ఆగం చేసేందుకే అధ్యా పకుల పోస్టులను భర్తీ చేస్తలేరని విమర్శిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాల యాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేవరకు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కొట్లాడుతుందని ఆమె స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో మెరుగైన విద్య అందేవరకూ విద్యార్థుల పక్షాన పోరాడుతామని షర్మిల హెచ్చరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement