వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్‌ మోసం  | Telangana: YSRTP YS Sharmila Hits Out CM KCR | Sakshi
Sakshi News home page

వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్‌ మోసం 

Jan 6 2023 4:28 AM | Updated on Jan 6 2023 4:28 AM

Telangana: YSRTP YS Sharmila Hits Out CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పైకిమాత్రం ధనిక రాష్ట్రం, అధిక ఆదాయం.. లోపల మాత్రం అప్పుల బెడద అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. పావలా వడ్డీకే రుణాలిచ్చి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేవుడైతే.. వడ్డీ లేని రుణాలని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు.

ఓట్ల కోసం ఉచిత వడ్డీ అని ఆశ చూపి, లోన్లు ఇచ్చి.. ఆ తర్వాత ముఖం చాటేశారంటూ గురువారం ట్వీట్‌ చేశారు. సర్కారు నుంచి వడ్డీ బకాయిలు రాకపోవడంతో.. బ్యాంకులు ముక్కుపిండి మరీ 12 శాతం నుంచి 13.7 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో మహిళలకు కూడా అన్యాయమే జరుగుతోందని షర్మిల ధ్వజమెత్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement