షా జీ.. చీకటి మిత్రుడిపై ఈగ వాలనివ్వరుగా! 

Telangana TPCC Chief Revanth Reddy Responded to Amit Shah Speech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తుక్కుగూడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రసంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. షా ప్రసంగం కొండంత రాగం తీసి.. అన్నట్టుగా ఉందని శనివారం రాత్రి ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

’తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై ఆర్భాటపు ప్రకటన తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది. అంతేనా షా జీ.. మీ చీకటి మిత్రుడిపై ఈగ వాలనివ్వరుగా!!’ అని ఆ ట్వీట్‌లో రేవంత్‌  పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top