రావణరాజ్యం పోవాలంటే బీజేపీ గెలవాలి  | Sakshi
Sakshi News home page

రావణరాజ్యం పోవాలంటే బీజేపీ గెలవాలి 

Published Fri, Oct 22 2021 2:12 AM

Telangana: Former MP Vijayashanti Comments On BJP Party - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రావణరాజ్యం పోయి రాముని రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గురువారం ఆమె హుజూరాబాద్, జమ్మికుంటల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్‌షోల్లో మాట్లాడుతూ, కేసీఆర్‌కు ఉద్యమకారులను మోసం చేయడం అలవాటేనని.. గతంలో ఆలె నరేంద్ర, తర్వాత తనను, నేడు ఈటలను పార్టీ నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు.

హుజూరాబాద్‌ ప్రజలు, సోషల్‌ మీడియాలో నెటిజన్ల ఉత్సాహం చూస్తుంటే రాజేందర్‌ విజయం ఖాయమైనట్లేనని విజయశాంతి అన్నారు. ఎన్నికల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారని  దళితబంధు పథకాన్ని మూడునెలల కిందట ప్రకటించినా.. లబ్ధిదారులందరికీ రూ.10 లక్షలు ఎందుకు ఇవ్వలేదన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement