ధనిక రాష్ట్రం.. జీతాలివ్వలేని స్థితికి | Telangana BJP President Bandi Sanjay Slams On CM KCR | Sakshi
Sakshi News home page

ధనిక రాష్ట్రం.. జీతాలివ్వలేని స్థితికి

Jun 3 2022 2:42 AM | Updated on Jun 3 2022 9:10 AM

Telangana BJP President Bandi Sanjay Slams On CM KCR - Sakshi

బీజేపీ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ అభ్యున్నతి, పేదల ప్రగతి కోసం ప్రధాని మోదీ సాహసోపేత కార్యక్రమాలు అమలు చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.  రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్‌ మాత్రం రాజకీయ లబ్ధి కోసం కేంద్రాన్ని బద్నామ్‌ చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన దుర్మార్గంగా మారిందని, ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాల్జేసి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని ధ్వజమెత్తారు.  గురువారం బీజేపీ కార్యాలయంలో పార్టీనేతలతో కలిసి మీడియా సమావేశంలో మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనపై ప్రత్యేక గీతం, పాకెట్‌ డైరీ, కరపత్రాలు.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలపై కరపత్రాన్ని సంజయ్‌ విడుదల చేశారు.  

సేవా సుపరిపాలన గరీబ్‌ కల్యాణ్‌ పేరిట మోదీ పాలన విజయాలపై ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పద్మశ్రీ గాజం గోవర్ధన్, చింతకింది మల్లేశం, డా.అబ్దుల్‌ వాహీద్, పర్యావరణ ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణ, క్రికెటర్‌ నాగేందర్, సైక్లింగ్‌ చాంపియన్‌ మాస్టర్‌ శశాంక్‌రెడ్డిలను శాలువా, మెమెంటోతో సత్కరించార 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement