చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా..  

TDP Chief Chandrababu High Drama In Eluru District - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజలను రెచ్చగొట్టేలా.. స్థానికంగా విద్వేషాలు రగిల్చేలా.. స్థానిక ప్రజాప్రతినిధులను చులకన చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. ప్రతి చోటా హైడ్రామా సృష్టించి టీడీపీ కేడర్‌ గందరగోళం చేయడానికి ప్రయత్నించింది.

పర్యావసానంగా కొయ్యలగూడెం మండలంలో చంద్రబాబుకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. గో బ్యాక్‌ బాబు అంటూ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, స్థానికులు ప్లకార్డులు చూపారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నిరసనలు, స్వల్ప ఉద్రిక్తతలు, ధర్నాల నడుమ ముగిసింది.

రెచ్చగొట్టే ప్రసంగాలతో.. 
కొయ్యలగూడెంలో చంద్రబాబు బీసీ సదస్సులో మాట్లాడి రోడ్‌షో ప్రారంభించి ప్రతి చోటా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అధినేతే అలా మాట్లాడుతుండటంతో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయారు. కొయ్యలగూడెంలో చంద్రబాబుకు గో బ్యాక్‌ అంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసన తెలియజేయడంతో రెచ్చిపోయిన టీడీపీ కేడర్‌ వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా నాయకుడు మూర్తిరాజు తలకు గాయమైంది.

పోలీసులు జోక్యం చేసుకోవడంతో టీడీపీ రోడ్‌షో కొనసాగింది. అక్కడ నుంచి పోలవరం చేరుకున్న చంద్రబాబు నానా హడావుడి చేశారు. నా మానసపుత్రిక అయిన ప్రాజెక్టును చూడటానికి నన్నే అనుమతించరా అంటూ మహిళా డీఎస్పీపై మండిపడ్డారు.

ప్రాజెక్టులో పనులు జరుగుతున్న క్రమంలో సందర్శించడానికి పోలీసు అనుమతి తప్పనిసరని, ముందుగా అనుమతి తీసుకోవాలని, పైగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అనుమతించడం లేదని చంద్రబాబుకు డీఎస్పీ చెప్పినా హడావుడి చేసి పెద్ద పెద్ద కేకలు వేసి టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో 15 నిమిషాలు తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్లి సభలో మాట్లాడి కొవ్వూరుకు చంద్రబాబు పయనమయ్యారు. ప్రతి చోటా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తీవ్రస్థాయిలో దూషించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు లక్ష్యంగా విమర్శలు ఆయన చేశారు.
చదవండి: చంద్రబాబుకు చాదస్తం మరీ ఎక్కువైంది    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top