Supreme Court To Hear Rahul Gandhi Appeal In Defamation Case On July 21st - Sakshi
Sakshi News home page

PM Modi Surname Case: రాహుల్‌ అభ్యర్థన పిటిషన్‌పై విచారణకు సుప్రీం ఓకే.. 21న లిస్ట్‌

Published Tue, Jul 18 2023 11:28 AM

Supreme Court to hear on July 21 Rahul Gandhi appeal - Sakshi

సాక్షి, ఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ నెల 21న విచారణ చేపడతామని  మంగళవారం రాహుల్‌ గాంధీ తరపున న్యాయవాదికి సీజేఐ బెంచ్‌ స్పష్టం చేసింది. 

రాహుల్‌ గాంధీ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ర్యాలీలో  మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకుగానూ  బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ ఈశ్వర్‌బాయ్‌ మోదీ సూరత్‌కోర్టులో దావా వేశారు. ఈ ఏడాది మార్చిలో ఆయన్ని దోషిగా తేలుస్తూ తీర్పు వెలువడగా..  ఆపై శిక్ష రద్దు/స్టే కోరుతూ సెషన్స్‌ కోర్టుకు వెళ్లారు. కానీ, కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో.. గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లగా.. జులై 7వ తేదీన హైకోర్టు ఆయనకు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. 

ఇక చివరగా.. గుజరాత్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ..  ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఒకవేళ శిక్ష గనుక రద్దు అయితే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యే ఛాన్స్‌ ఉంది. లేకుంటే ఆరేళ్ల దాకా ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.

Advertisement
Advertisement