బాబు అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందే | Somu Veerraju Comments On Chandrababu Naidu Corruption | Sakshi
Sakshi News home page

బాబు అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందే

Dec 20 2020 3:17 AM | Updated on Dec 20 2020 3:17 AM

Somu Veerraju Comments On Chandrababu Naidu Corruption - Sakshi

కర్నూలు కల్చరల్‌/ఎమ్మిగనూరు రూరల్‌: అమరావతికి చంద్రబాబు ఖర్చు చేసిన రూ.7,200 కోట్లు, అందుకు సంబంధించిన అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు. అలాగే ఎమ్మిగనూరులో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు.

ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి బీజేపీ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. ఎంపీ టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్రం వేల కోట్లు నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేయడం లేదన్నారు. బీజేపీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, చంద్రమౌళి, నీలకంఠ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement