జనసేన పోటీ నుంచి తప్పుకున్నా మేము బద్వేలులో పోటీచేస్తాం

Somu Veerraju Comments On Badvel Bypoll - Sakshi

జనసేన తప్పుకున్నా మా పోరు ఆగదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

సాక్షి, అమరావతి బ్యూరో: బద్వేలు ఉప ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలుపుతామని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవ, సమర్పణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన గుంటూరులో పర్యటించారు. రక్తదాన శిబిరం, ప్రధాని మోదీ జీవిత విశేషాలు తెలిపే ఫొటో ఎగ్జిబిషన్, పోస్టుకార్డుల ద్వారా మోదీకి ధన్యవాదాలు తెలపటం, చర్మకారులకు ట్రంక్‌ పెట్టెలు అందజేసే కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మిత్రపక్షం జనసేన పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించినప్పటికి తాము పోటీ చేస్తామని, బద్వేలు పోరులో సహకరించమని జనసేన పార్టీని కోరతామన్నారు.  ఉప పోరు తర్వాత తమ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పారు. టీడీపీ కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది కదా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ‘ఓ పార్టీ తిరుపతిలో పోటీ చేస్తుంది.. జెడ్పీ ఎన్నికలు వచ్చేసరికి బహిష్కరిస్తున్నామని ప్రకటిస్తుంది. ఆ విధానమేంటో అర్థం కావట్లేదు’ అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top