బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మె‍ల్యేలు

Six JDU MLAs Joins In BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఊహించని షాక్‌ ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు జేడీయూ శాసనసభ్యులు అధికార బీజేపీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ అధికార ప్రకటన చేశారు. 2019లో జరిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. అయితే గతకొంత కాలంగా ఇరు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మొత్తం 60 మధ్య సభ్యులు గల అరుణాచల్‌ ప్రదేశ్ శాసనసభలో జేడీయూ ఎమ్మెల్యేల చేరికతో బీజేపీ బలం 48కి చేరింది. (మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్‌)

ఇక ఏకైక సభ్యుడు గల పీపుల్స్‌ పార్టీ ఆఫ్ ఆరుణాచల్‌ ప్రదేశ్‌ ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సభలో ప్రస్తుతం కాంగ్రెస్ నలుగురు, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి నలుగురు సభ్యుల బలం ఉంది. కాగా బిహార్‌లో బీజేపీ మద్దతు నితీష్‌ కుమార్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌ వ్యవహరంలో బిహార్‌ జేడీయూ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపార్టీకి చెందిన సభ్యులను బీజేపీ మభ్యపెట్టిందని ఆరోపిస్తున్నారు. దీనిపై నితీష్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top