ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ

Shock To Hindupur MLA Balakrishna In Panchayat Elections - Sakshi

సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది.

పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది.
చదవండి: పులివెందుల ‘పంచ్‌’ అదిరింది 
మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top