breaking news
hindupur constency
-
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం -
తెలుగు తమ్ముళ్ల కొట్లాట
అనంతపురం: అధికార పార్టీలో ఆదిపత్య పోరు రోజురోజుకు ఎక్కువవుతోంది. బాలకృష్ణ నియోజకవర్గం హిందుపురంలో ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా పార్టీ అంతర్గత గొడవలు మరోసారి బయటపడ్డాయి. హిందూపూర్ నియోజక వర్గ పరిధిలోని చిలమత్తూరు రిచ్మన్ ఫ్యాక్టరీలో బుధవారం జరిగిన మండలస్థాయి సమావేశంలో తెలుగుదేశం కార్యకర్తలు మధ్య వాగ్వాదం తలెత్తింది. రైతు సంఘం నాయకుడు బ్రహ్మానందరెడ్డి, ఎంపీపీ అన్సారీ వర్గాలమధ్య ప్రారంభమైన మాటల దాడి కొట్లాట దాకా వెళ్లింది. ఆ సమయంలో ఎంపీపీ వర్గీయులు కుర్చీలతో రైతు నాయకులపై దాడికి దిగారు. ఈ దాడికి నిరసనగా రైతు నాయకులు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు