మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం

TDP Bandaru Satyanarayanamurthy Wife Lost In His Hometown Visakha - Sakshi

స్వగ్రామంలో భార్య ఓటమి

సాక్షి, విశాఖపట్నం: మరో టీడీపీ నాయకుడికి ‘కుప్పం’ అనుభవం ఎదురైంది. విశాఖ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తికి సొంత గ్రామంలోనే తీవ్ర పరాభవం ఎదురైంది. పరవాడ మండలం వెన్నెలపాలెంలో గతంలో రెండు దఫాలు సర్పంచ్‌గా పనిచేసిన తన భార్య మాధవీలతను ఈసారి కూడా పోటీకి నిలిపారు. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు.. ఆమెపై 464 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గ్రామంలోని మొత్తం 10 వార్డులనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలవడం మరో విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ పెందుర్తి నియోజకవర్గంలో యువకుడైన అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ (వైఎస్సార్‌సీపీ) చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్సార్‌సీపీ మద్దతుతో పెందుర్తి మండలంలోని రాంపురం గ్రామ సర్పంచ్‌ పదవికి పోటీ చేసిన ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సతీమణి శిరీష ఘన విజయం సాధించారు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top