టాప్‌ 3 టాపిక్స్‌.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!

Sakshi TV Gunshot Top 3 Topics Analysis

కమలంతో పొత్తు కోసం బాబుగారి వెంపర్లాట.. ఖమ్మంలో కన్నింగ్ ప్లాన్ అదేనా ?
గత ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసిన టీడీపీ చిత్తయ్యింది. కేవలం 23 సీట్లకే పరిమితమై ఘోర పరాభావం చవిచూసింది. అంటే చంద్రబాబును ప్రజలు నమ్మలేదనే విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. మరి ఈసారి కూడా ఒంటిరిగా వెళితే పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందనే భావనలో ఉన్న చంద్రబాబు.. కమలంతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు.  బాబు గారి ఖమ్మం పర్యటన కన్నింగ్‌ ప్లాన్‌ అదేనా?

విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్ భావిస్తున్నారా ?
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోయి.. పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియా, డిజిటల్‌ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలానికి చెక్‌ పెట్టే దిశగా సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో తలరాతలు మార్చాలనే యోచన సీఎం జగన్‌ది. భావి తరాల పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబంలో అభివృద్ధి ఉంటుందనేది సీఎం జగన్‌ ఆలోచన. విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్‌ భావిస్తున్నారా?

విశాఖ బ్రాండ్‌ వాల్యూ విశ్వవ్యాప్తం చేస్తున్నారా ?
ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌)గా విశాఖపట్నా­న్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్‌ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వరుస అంతర్జాతీయ కార్య­క్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న (మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీ) నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది.  వరుసగా ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు చేపట్టడానికి విశాఖ బ్రాండ్‌ వాల్యూనూ విశ్వవ్యాప్తం చేయడానికేనా?

తేల్చేద్దాం ...గన్ షాట్‌గా... 
శనివారం రాత్రి  7 గంటలకు 
తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top