Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Sakshi Breaking News Trending News Morning News Roundup 4th August 2022 | Sakshi
Sakshi News home page

Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Oct 4 2022 10:31 AM | Updated on Oct 4 2022 11:15 AM

Sakshi Breaking News Trending News Morning News Roundup 4th August 2022

నార్త్‌ కొరియా మరోసారి రెచ్చిపోయింది. మంగళవారం జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​పణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

1. మునుగోడుపై టీఆర్‌ఎస్‌ ఫుల్‌ ఫోకస్‌! రంగంలోకి కేటీఆర్‌, హరీశ్‌ కూడా?
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడటంతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సర్వశక్తులూ ఒడ్డి అయినా మునుగోడులో విజయం సాధించాలని భావిస్తోంది.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఇక కొత్త రోస్టర్‌.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు
రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్‌ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు 
ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్‌ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఏపీ రైతులకు అలర్ట్‌.. ఈ నెల 12 వరకే గడువు..
పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మరోసారి రెచ్చిపోయిన నార్త్‌కొరియా.. జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం
నార్త్‌ కొరియా మరోసారి రెచ్చిపోయింది. మంగళవారం జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​పణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం
ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్‌
జమ్ముకశ్మీర్‌ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితులు ఆయనను గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గిన 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలు
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్‌ నెలలో 11 రకాలైన నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. IND vs SA 2nd T20: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ గురి
ఆస్ట్రేలియాపై సిరీస్‌ సొంతమైంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ దక్కింది. ఇక శనివారం ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరేముందు మరో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. అయితే రెండు సిరీస్‌లు సాధించినా, ఒక ప్రధాన సమస్య మాత్రం జట్టును ఇంకా ఇబ్బంది పెడుతోంది.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Bigg Boss 6 Telugu: ఈసారి కాస్త డిఫరెంట్‌గా.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే
ఈవారం నామినేషన్స్‌ ప్రక్రియలో రోహిత్‌ అండ్‌ మెరీనాలకు షాక్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. గతంలో పోలిస్తే ఈసారి నామినేషన్స్‌ ఇద్దరి ఫ్రెండ్స్‌ మధ్య జరిగింది. వారిలోనే ఎవరో ఒకరు నామినేట్‌ అయి, మరొకరు సేవ్‌ అవ్వాల్సిందిగా ఆదేశించాడు. 

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement