ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు: రేవంత్‌ ఫైర్‌

Revanth And Etala Spar Over Congress TRS relation - Sakshi

అప్‌డేట్స్‌

18:32 PM

భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఈటల రాజేందర్‌ రాకపోవడంతో రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా రేవంత్‌ మాట్లాడుతూ.. నేను అమ్మవారిని నమ్ముతాను. మునుగోడులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మునుగోడులో రూ.3వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మునుగోడులో మద్యం పంపిణీ లేకుండా మేం ఓట్లు అడిగాం. ఒక్క రూపాయి పంచకున్నా పాల్వాయి స్రవంతికి పాతికవేల ఓట్లు వచ్చాయి. నిజాయితీగా 20వేల మంది కాంగ్రెస్‌ వెంట నిలిచారు. 

అమ్మవారి సాక్షిగా చెబుతున్నా. అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నా. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్‌ విసురుతున్నా. కేసీఆర్‌ నుంచి సాయం పొంది ఉంటే మేమే సర్వనాశనమవుతాం. నేను చెప్పింది అబద్ధమైతే.. సర్వనాశనమైపోతాను. ఆధారాలు లేనప్పుడు దేవుడిపై ఆధారపడతాం. గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతా. ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఈటల రాజేందర్‌ ఆలోచించి మాట్లాడాలి అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో రేవంత్‌ భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టుకున్నారు. 
 

05:55PM 

  • భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి
  • ఇంట్లోనే ఈటల రాజేందర్‌

 05:00PM

  • బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై సవాల్‌ విసిరిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మీ ఆలయానికి బయల్దేరారు.
  • చార్మినార్‌ పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ రూ. 25 కోట్లు ఇచ్చిందని ఈటల ఆరోపించగా, దానికి రేవంత్‌ సవాల్‌ విసిరారు.ఈటల చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్యి ఆలయానికి బయల్దేరారు. తనపై ఆరోపణలు చేసేవారు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్‌ చేశారు.  దీనిపై ఈటల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. కాగా, ఈటల చేసిన వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్‌ కౌంటర్‌ ఎటాక్‌కు దిగింది. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top