రాహుల్ గాంధీ డిమాండ్ సరైనదే: చిదంబరం | Rahul Gandhi 'Absolutely Correct', Says P Chidambaram | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ డిమాండ్ సరైనదే: చిదంబరం

May 10 2024 2:38 PM | Updated on May 10 2024 2:56 PM

Rahul Gandhi 'Absolutely Correct', Says P Chidambaram

న్యూఢిల్లీ: ఇద్దరు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్‌కు డబ్బు పంపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధినేత 'రాహుల్ గాంధీ' కోరడం సరైనదే అని కేంద్ర మాజీ మంత్రి 'పీ చిదంబరం' అన్నారు. దీనికి సంబంధించి తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ ట్వీట్ కూడా చేశారు.

ప్రధానమంత్రి చేసిన ఆరోపణను చాలా సీరియస్‌గా చూడాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ న్యాయమైనదే.. కానీ ఈ విషయం మీద బీజేపీ మౌనం వహిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ అంబానీ, అదానీలతో ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ.. రాహుల్ గాంధీ కోసం ఇద్దరు పారిశ్రామికవేత్తల నుంచి ఆ పార్టీకి భారీగా నల్లధనం వచ్చిందా అని మోదీ అన్నారు. మోదీ ఆరోపణల ఆధారంగా అదానీ, అంబానీలపై దర్యాప్తునకు సీబీఐ లేదా ఈడీల విచారణకు మోదీ ఎప్పుడు ఆదేశిస్తారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లలో వీడియో సందేశాలను కూడా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement