ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి: రాచమల్లు | Rachamallu Siva Prasad Reddy Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి: రాచమల్లు

Nov 14 2024 12:59 PM | Updated on Nov 14 2024 1:01 PM

Rachamallu Siva Prasad Reddy Serious Comments On CBN Govt

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఏపీలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.

సోషల్‌ మీడియాలో టీడీపీ వారు పెట్టిన అసభ్యకర పోస్టులపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి..  ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం, రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ.. నాపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు  సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము.

కూటమి ప్రభుత్వం ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాము. మా పార్టీ  ప్రతి కార్యకర్త, నాయకులకు మేము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. అలాగే, కూటమి నేతల అబద్ధాలను ఎండగడతాం. ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తున్నాయి అని కామెంట్స్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: అక్రమ బెల్ట్‌ షాపులు.. బాలకృష్ణ నియోజకవర్గంలో ఏరులై పారుతున్న లిక్కర్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement