
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబుకు ఏజెంట్‌గా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ మిలిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పి. గౌతమ్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాక్ స్వాతంత్రం హరించేలా ఎస్‌ఈసీ ప్రవర్తించారని ధ్వజమెత్తారు. టీడీపీ మేనిఫెస్టో మీద ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఫైబర్ నెట్‌లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతల ఫిర్యాదును ఆయన తప్పుపట్టారు. ఇది సబబు కాదన్నారు. కేంద్ర పథకాలలో ప్రధానమంత్రి ఫోటో ఉంటే.. అది కూడా తీసెయ్యాలా అని గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ)
(చదవండి: చంద్రబాబూ.. డ్రామాలు ఆపు: అవంతి)