పంజాబ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!

Punjab Elections 2022: Congress Not To Announce 2 Chief Ministers  - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరూ ఉంటారంటూ వస్తున్న పుకార్లను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. అంతేకాదు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకరి పేరును మాత్రమే ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవీ కోసం పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ, నవజ్యోత్‌ సిద్ధూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో రాహుల్‌​గాందీ లూథీయానాలో ఈ ఇద్దర్ని పంజాబ్‌ ముఖ్యమంత్రులు ప్రకటిస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

అంతేకాదు ఈ ప్రచారం ఊపందుకున్న తర్వాత రోజే అక్రమ కేసుల తవ్వకాల్లో చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముందంజలో చన్నీ ఉన్నందున సిద్దూ తన సొంత పార్టీపై దాడిని పెంచారు. మరోవైపు చన్నీ మేనల్లుడు అరెస్టు కావడంతో ప్రత్యక్ష విమర్శదాడులకు దిగారు. ఈ మేరకు సిద్దూ పార్టీ నిజాయితీ, క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారిని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు.

అంతేకాదు కాంగ్రెస్‌ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు మెగ్గుచూపుతున్నట్లుగా పలు సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రజలు ఏ నాయకుడికి అనుకూలంగా ఉన్నారో ఎంచుకోవడానికి ఐవీఆర్‌(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్‌ల ద్వారా పబ్లిక్ సర్వేను కూడా నిర్వహిస్తోంది. అయితే చన్నీ బంధువు అరెస్టు కావడంతో సిద్దూ తన వాదనను వినిపించేందుకు దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకున్నారు. అంతేకాదు చన్ని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నామినేట్ అవ్వడం, మరోవైపు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కూడా చన్నీకి మరో అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ పార్టీని కోరడం వంటి తదితర కారణాలతో చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఊహాగానాలకు తెర తీసింది.  మరోవైపు సిద్ధూ కూడా తనను తాను అభ్యర్థిగా చెప్పుకోవడానికి పదేపదే ప్రయత్నించడం గమనార్హం.

(చదవండి: సీఎం అభ్యర్థి చాయిస్‌.. చాన్స్‌ కాదు’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top