
తృణమూల్ కాంగ్రెస్‌పై నేరం మోపాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు సొంత కార్యకర్తలనే చంపేస్తున్నారని, సొంత వాహనాలను ధ్వంసం చేసుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థి స్వయంగా సొంత కారును ధ్వంసం చేసుకుని, టీఎంసీపై ఆరోపణలు చేసిందన్నారు. కూచ్‌బిహార్ హింసాకాండను సమర్ధిస్తూ మాట్లాడుతున్న నాయకులపై రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కూచ్‌బిహార్ జిల్లాలోని సీతల్‌కుచిలో శనివారం సీఐఎస్‌ఎఫ్ కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై మమత సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేసే వారు మనుషులే కారని మండిపడ్డారు. ‘సీతల్‌కుచి తరహా కాల్పులు మరిన్ని జరుగుతాయని కొందరు నాయకులు అంటున్నారు. సీతల్‌కుచిలో జరిగిన కాల్పుల్లో చనిపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటే బావుండేదని మరి కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.