ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బద్వేలు బరిలో 15 మంది

Nomination Withdraw Close 15 People In Badvel Bypoll 2021 - Sakshi

సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు.

ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్‌ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. 

హుజూరాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు
సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ​ఉప​ ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్‌లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top