కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్‌

Nitish Kumar Takes Oath As Chief Minister For 4th Term - Sakshi

ఉప ముఖ‍్యమంత్రులుగా ఇద్దరు

డిప్యూటీ సీఎంగా మహిళకు అవకాశం

సాక్షి, పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌​ (69)ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాల్గవసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన ఘనతను నితీష్‌ దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్‌ నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి  బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా హాజరయ్యారు. 

ఉత‍్కంఠ పోరులో విజయాన్ని చేజిక్కించుకున్న ఎన్‌డీఏ కొత్త సర్కార్‌ కొలువు దీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూనుంచి ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కగా, ఉప ముఖ్యమంత్రి పదవులను బీజేపీ సొంతం చేసుకోవడం విశేషం. 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు.  డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తార్‌కిషోర్ ప్రసాద్ రేణూ దేవీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం సమావేశమైన ఎన్డీఏ శాసనసభ పార్టీ నాయకులు  నితీష్ కుమార్‌ను  నాయకుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసినవారు:  కొత్త మంత్రివర్గంలో చేరిన 12 మంది మంత్రులలో బీజేపీ నుంచి మంగల్ పాండే , అమరేంద్ర ప్రతాప్‌ సింగ్‌  ఉన్నారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు చెందిన సంతోష్ మాంజి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవా లాల్ చౌదరి, వికా షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కు చెందిన ముఖేష్ మల్లా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top