అసత్య ప్రచారాలు నమ్మొద్దు

Narayana Swamy Comments About Covid Deaths - Sakshi

కోవిడ్‌ మరణాలపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి 

కార్వేటినగరం (చిత్తూరు జిల్లా):  కోవిడ్‌–19 వైరస్‌ అనేక మందిని బలితీసుకుంటూ, బంధువులను, కుటుంబసభ్యులను దహనక్రియలకు దూరం చేస్తున్న సమయంలో చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్యంలో ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. భర్త మృతదేహాన్ని తన కొడుకుతో కలసి భార్య దహనక్రియలు నిర్వహించింది. స్పందించిన ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి వారిని అభినందించారు. బుధవారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. 

► కరోనా వైరస్‌ మనిషి మృతి చెందిన మూడు నుంచి నాలుగు గంటల వరకే జీవించి ఉంటుంది. 
► కొందరు  అసత్య ప్రచారాలను నమ్మి కరోనా మృతదేహాలను ఖననం చేయడాన్ని అడ్డుకుంటూ మానవత్వాన్ని మరిచిపోతున్నారు. 
► సీఎం వైఎస్‌ జగన్‌ ఓ గొప్పశాస్త్రవేత్తగా ఆనాడే కరోనా వైరస్‌తో ప్రజలు మమేకమై జీవనం సాగించక తప్పదని చెప్పారు. అది ముమ్మాటికీ నిజమని నిరూపించుకున్నారు.  
► చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్యం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటక్రిష్ణయ్య కరోనాతో మృతిచెందితే అతని భార్య పద్మమ్మ, కుమారుడు మాజీ సర్పంచ్‌ తిలక్‌ తండ్రి మృతదేహం కోసం అధికారుల వద్దకు తిరిగి, ఒప్పించి  మంగళవారం తమ సొంతపొలంలో ఖననం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మాటలను తు.చ. తప్పక పాటించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top