అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే | Modi As The Successor Of Br Ambedkar Says Bandi Sanjay | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే

Apr 20 2025 1:22 PM | Updated on Apr 20 2025 4:53 PM

Modi As The Successor Of Br Ambedkar Says Bandi Sanjay

పెద్దపల్లి జిల్లా,సాక్షి: పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై  ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాం. అలాంటి బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎంకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది.  

టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం పార్టీది. న్యాయస్థానాలపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది. నిన్న జరిగిన మీటింగుకి ఖర్మ, కర్త, క్రియ రేవంత్ రెడ్డియే..మీటింగు కోసం నిధులు సమకూర్చింది కూడా రేవంత్ రెడ్డియే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు నాటకాలాడుతున్నాయి.  

మంచి ఉద్దేశంతో  బిల్ తీసుకువస్తే మత కోణంలో ప్రతిపక్షాలు  విద్వేశాలు రెచ్చగొడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే.  వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి. రైతుల విషయాన్ని పక్కన పెట్టి వక్ఫ్ మీటింగు కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తాపత్రయ పడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement