అందుకే రాజీనామా చేస్తున్నా.. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల గుడ్‌బై

MLC Kuchukulla Damodar Reddy Resigned BRS - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎన్నికల వేళ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పంపారాయన. పార్టీలో సముచిత స్థానం దక్కినప్పటికీ..  స్థానిక సమస్యల కారణంగానే బయటకు రావాల్సి వచ్చిందంటూ లేఖలో ప్రస్తావించారాయన. 

‘‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి వెళ్లి కలిసేవాడ్ని. కానీ, కేసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. పదిసార్లు వెళ్లినా.. కనీసం కలవలేదు. పార్టీ పరంగా నాకు సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారాయన. 

స్థానికంగా ఎటువంటి ప్రయారిటీ లేదని.. ఎమ్మెల్సీ అంటే ఒక స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారాయన. కేటీఆర్‌ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని లేఖలో విమర్శించారు కూచుకుళ్ల. మరోవైపు  నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే కూచుకుళ్ల రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారనే ప్రచారం గత నాలుగైదు నెలలుగా నడుస్తోంది కూడా.

కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్‌ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే  ఆ తర్వాత టీఆర్‌ఎస్‌(ఇప్పుడు బీఆర్‌ఎస్‌)లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. బీఆర్‌ఎస్‌కు రాజీనామా నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నెల చివర్లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-11-2023
Nov 11, 2023, 07:57 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ...
11-11-2023
Nov 11, 2023, 07:38 IST
సాక్షి, ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ అల్లూరి సంజీవ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. శుక్రవారం ఆయన...
11-11-2023
Nov 11, 2023, 07:02 IST
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ...
11-11-2023
Nov 11, 2023, 06:50 IST
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మారబోయిన రవికుమార్‌ యాదవ్‌ స్థిరచరాస్తుల విలువ అక్షరాల రూ.151 కోట్లకు పైమాటే. అప్పు...
11-11-2023
Nov 11, 2023, 06:35 IST
సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం వేసిన నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు....
11-11-2023
Nov 11, 2023, 05:32 IST
సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం...
11-11-2023
Nov 11, 2023, 05:23 IST
సిర్పూర్‌(టి)/కౌటాల, సిరిసిల్ల: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆరే పెడుతున్నారని...
11-11-2023
Nov 11, 2023, 05:15 IST
సాక్షి, న్యూఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా...
11-11-2023
Nov 11, 2023, 04:47 IST
కాచిగూడ (హైదరాబాద్‌): పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌...
11-11-2023
Nov 11, 2023, 04:24 IST
హుజూరాబాద్‌: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని...
10-11-2023
Nov 10, 2023, 20:15 IST
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే...
10-11-2023
Nov 10, 2023, 17:29 IST
మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదన వెంటనే వెనక్కి.. 
10-11-2023
Nov 10, 2023, 15:29 IST
2018 ఎన్నికలకు  2,644 నామినేషన్లు రాగా.. ఈసారి నిన్నటితోనే ఏకంగా.. 
10-11-2023
Nov 10, 2023, 12:41 IST
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంతో మంది నేతలు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా పార్టీనే నమ్ముకుని.. ప్రజలతో...
10-11-2023
Nov 10, 2023, 12:08 IST
పరకాల: ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గురువారం ఏకాదశి కావడంతో మంచిరోజు అని.. నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయానికి చేరుకున్నారు....
10-11-2023
Nov 10, 2023, 06:25 IST
మధిర/సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని...
10-11-2023
Nov 10, 2023, 06:16 IST
సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు...
10-11-2023
Nov 10, 2023, 05:50 IST
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం...
10-11-2023
Nov 10, 2023, 05:46 IST
సిరిసిల్ల/ కొడంగల్‌: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్‌ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక...
10-11-2023
Nov 10, 2023, 05:40 IST
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం,... 

Read also in:
Back to Top