సినిమాల్లో హీరోలు తాగితే తప్పు లేదా?: అనిరుధ్‌రెడ్డి | MLA Anirudh Reddy Made Sensational Comments On Film Industry, Questions Double Standards On Celebrities And Politicians Drinking | Sakshi
Sakshi News home page

MLA Anirudh Reddy: సినిమాల్లో హీరోలు తాగితే తప్పు లేదా?

Mar 31 2026 1:39 PM | Updated on Mar 31 2026 2:06 PM

Mla Anirudh Reddy Sensational Comments On Film Industry

సాక్షి, హైదరాబాద్‌: సినిమా వాళ్ళు చేస్తే ఒప్పు, రాజకీయ నాయకులం చెప్తే తప్పా? అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన సీఎల్పీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. హీరోలకంటే రాజకీయ నాయకులకు ప్రైవసీ లేకుండా పోయింది.. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా?’’ అంటూ మండిపడ్డారు.

‘‘ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తాగుతాడు. ధూల్‌పేటలో గుడుంబా దొరుకుంటుందని సినిమాలో చూపెట్టాడు. బాలకృష్ణ సినిమాలో మామా ఏక్ పెగ్ లా అనే పాటలో నటించాడు. మందుబాబులం అనే పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశారు. రాజకీయ నాయకులం కల్తీసారా తాగకండి అంటే బద్నాం చేస్తారా.. ఎక్కువ డ్రగ్స్ వాడేది సినీ ఇండస్ట్రీ లోనే’’ అని అనిరుధ్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

‘‘సినీ యాక్టర్స్ అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. సినిమా వాళ్లపైనే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. మా రాజకీయ నాయకులపై ఎక్కువగా రూమర్స్ లేవు. అందరూ సినిమా యాక్టర్స్ 90 రోజుల కోకసారి పాలికర్ టెస్ట్ చేయించుకోవాలి. నేను కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా.. నా కొడుకు నన్ను డ్రగ్స్ గురించి అడిగాడు. ఇప్ప సారా ఇండియన్ లిక్కర్. ఇప్పసారాను బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పసారాకు 3000 ఏండ్ల చరిత్ర ఉంది. నేను సారాకి వ్యతిరేకం. తాగమంటున్నాడని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.

కల్తీ సారా కంటే ఇప్పసారా చాలా మంచిది. రాలిపోయిన ఇప్ప పూల నుండి సారా చేస్తారు. ఇప్ప సారా వల్ల లాభాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఆదివాసీలు లిక్కర్ చేస్తే తప్పా?. కార్పొరేట్ కంపెనీలు లిక్కర్ చేస్తే కరెక్టా?. ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ మంచిది. ఇండియా నుండి తీసుకుపోతున్న ఇప్ప పువ్వుతో విదేశాల్లో సారా చేసి వేలల్లో సంపాదిస్తున్నారు. ఆదివాసీలు ఉన్నారు కాబట్టే అడవులు ఉన్నాయి’’ అని  అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement