
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్(Erra Shekar) కాంగ్రెస్‌లో(Telangana Congress) చేరికపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని తనకు లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
జడ్చర్ల(Jedcherla MLA) ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు. ఇలాంటి వారి కోసం జడ్ కేటగిరి సెక్యూరిటీ అడగాలా?. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని నాకు లేదు. సంచులు తీసుకెళ్లేవారికి పార్టీలో చోటులేదు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరడానికి వీలులేదు. మోసం చేసి పోయినవారికి మళ్లీ ఎంట్రీలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత