8న భారత్ బంద్‌ విజయవంతం చేయాలి

Minister KTR Meeting With Greater MLAs - Sakshi

మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. ఆదివారం ఆయన గ్రేటర్‌ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గ్రేటర్‌లో మన ప్రయత్న లోపం లేదు.. ఎమోషన్ ఎలక్షన్ జరిగింది. సిట్టింగ్‌లను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్‌లను మార్చని చోట ఓడిపోయాం.. ఇక్కడే లెక్క తప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని’’ ఆయన పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. (చదవండి: పార్టీలో పోస్టుమార్టం చేసుకుంటాం : కేటీఆర్‌)

ఈ నెల 8న భారత్ బంద్‌ విజయవంతం చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్‌ కావాలన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు.. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 8న వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా బంద్‌లో పాల్గొన్నాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త 2 గంటల పాటు బంద్ పాటించాలని, ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్‌ విజయవంతం కావాలని తెలిపారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. (చదవండి: బీజేపీ: ఆపరేషన్‌ ఆకర్ష్‌..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top