చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారు’ | Minister Kakani Govardhan Reddy Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారు’

Nov 20 2022 1:31 PM | Updated on Nov 20 2022 1:41 PM

Minister Kakani Govardhan Reddy Takes On Chandrababu Naidu - Sakshi

నెల్లూరు :  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదని అనడానికి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శమన్నారు. చంద్రబాబు మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని కాకాణి స్పష్టం చేశారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదని అర్థం అవుతోంది. కర్నూల్ పర్యటన పై చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నాడు. కర్నూలు లో న్యాయ రాజధాని పై ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నాడు. చంద్రబాబును ప్రశ్నిస్తే వారిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా ముద్ర వేస్తున్నాడు’ అని తెలిపారు. చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారని కాకాణి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement