మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు: హోంమంత్రి సుచరిత

Mekathoti Sucharitha Slams On Ayyannapatrudu Statements - Sakshi

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ఆగ్రహం

సాక్షి, అమరావతి: ఎంతో సీనియర్, ఎన్నో పదవులు చేసిన అయ్యన్నపాత్రుడు ఒక దళిత మహిళ గురించి మాట్లాడిన తీరు అందరూ చూశారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక మహిళ కమిషనర్‌ను బట్టలు ఊడదీసి కొడతా అన్న వ్యక్తి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడని తాను అనుకోవడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అతడి వ్యాఖ్యలపై స్పందించకూడదనుకున్నా.. కానీ వాళ్లు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని తెలిపారు. దళిత జాతిలో పుట్టినందుకు తాను గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఒక దళిత మహిళగా ఏ జన్మలోనూ ఇలాంటి భాష మాట్లాడలేనని వివరించారు. గొప్పతనమనేది మన ప్రవర్తన బట్టి వస్తుంది.. అతడి సంస్కారం ఏమిటో అర్థం అవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి ఇచ్చింది సీఎం జగన్.. తనను గెలిపించింది నియోజకవర్గ ప్రజలు అని పేర్కొన్నారు.
చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా?

‘సీఎం జగన్‌ని మీరు మాట్లాడిన మాటలు ఏమిటి..? మీరు మహిళలను గౌరవించి ఉంటే మీకు 23 సీట్లు వచ్చేవి కాదు’ హోంమంత్రి సుచరిత విమర్శించారు. ‘వంగవీటి రంగాను చంపింది మీ హయాంలోనే కదా..? మీ హయాంలో ఒక హోంమంత్రిని హత్య చేశారు.. అప్పుడు మీకు శాంతి భద్రతలు గుర్తుకురాలేదా..? మీ మీద హత్యాయత్నం జరిగితే మీకు మద్దతుగా వైఎస్సార్ ఆందోళన చేశారు. మీరేమో జగన్‌పై దాడి జరిగితే కోడి కత్తి అన్నారు. జగన్ ఈ రోజు రాజీనామా చేయమంటే వెంటనే చేస్తాను.. మీరెవరు అడగడానికి..? మల్లెపూలు అమ్ముకునే వాళ్లు మనుషులు కదా...? గంజాయి అమ్ముకునే నువ్వే ద్రోహివి. ఒక దళిత మహిళను హోంమంత్రి చేస్తే మీకెందుకు కడుపు మంట.’
చదవండి: అమిత్‌ షా సభలో ‘ఈటల’ స్పెషల్‌ అట్రాక్షన్‌

‘ఆత్మాభిమానమే ముఖ్యంగా బతుకుతున్న దళిత మహిళను నేను. ఏదైనా శాఖాపరంగా అడగండి సమాధానం చెప్తా! మీ పరిపాలనలో మహిళకు ఏ మేరకు న్యాయం చేశారు..? నా మీద మీరు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమి చేస్తారో తేల్చుకోవాలి. లోపాలు ఉంటే ఎత్తి చూపండి సమాధానం చెప్తామ్. కానీ వ్యక్తిగత దూషణకు వెళ్తే సహించేది లేదు. ఒక మహిళా హోంమంత్రినే ఇలా మాట్లాడుతున్నారంటే ఇక సామాన్య మహిళలపై ఎలా ప్రవర్తిస్తారు..? జోగి రమేశ్‌ ఒక లేఖ ఇవ్వడానికి వెళ్తే ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. గతంలో కూడా అసెంబ్లీలో పాతరేస్తా అని మాట్లాడిన వాళ్లు ఇంతకంటే ఎలా ప్రవర్తిస్తారు?’ అని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top